ఏపీ అసెంబ్లీ లాబీల్లో పీఏసీ పదవిపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. పీఏసీ చైర్మన్‌గా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని జగన్‌ను ఎంపిక చేసిన నేపథ్యంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య చిట్‌చాట్ జరిగింది. డిప్యూటీ సీఎం చినరాజప్ప, ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర, వైసీపీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రు, అమర్నాథరెడ్డి మధ్య చర్చ జరిగింది.
తొలుత పలకరించిన చినరాజప్ప, దూళిపాళ్లలు పీఏసీ పదవి జ్యోతుల నెహ్రు అన్నకే దక్కుతుందని భావించామన్నారు. కానీ అది జరగలేదని గిల్లారు. తాను, నెహ్రు ఇద్దరం అనుభవజ్ఞులమేనని అయితే పదవులకు మాత్రం పనికిరామని ధూళిపాళ్ల అన్నారు. ఒకవిధంగా తనకు మంత్రి పదవి దక్కలేదన్న బాధను ధూళిపాళ్ల వెల్లగక్కారు. జోక్యం చేసుకున్న చినరాజప్ప… జ్యోతుల నెహ్రు టీడీపీలో ఉండి ఉంటే డిప్యూటీ సీఎంగా ఆయనే అయ్యేవారన్నారు.
ఇందుకు స్పందించిన నెహ్రు తాను పదవుల కోసం వెళ్లేవాడిని కాదని… పదవులే తన దగ్గరకు వస్తాయన్నారు. ప్రజాసేవకుడిగా తాను ఎలా ఉండేది అందరూ చూస్తున్నారని అన్నారు. చర్చలో అమన్నాథరెడ్డి కూడా జోక్యం చేసుకున్నారు. తాము కూడా నెహ్రుకే పీఏసీ పదవి వస్తుందనుకున్నామని కానీ బుగ్గనను ఎంపిక చేయడాన్ని ఊహించలేదన్నారు. జగన్ కూడా ఈ విషయం తమతో ముందుగా చెప్పలేదన్నారు. చిత్తూరు జిల్లా వారు తెలివైన వారిమనుకుంటారు గానీ… చివరకు నష్టపోయేది కూడా వాళ్లేననని చిత్తూరు జిల్లాకే చెందిన వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి అన్నారు.
Click on Image to Read: