రెజీనా కు డోర్స్ క్లోజ్ అవుతున్నాయా..?

టాలెండ్ వుండ‌టం ఒకెత్తు.  అది మంచి బ్రేక్ తో వెలుగులోకి రావ‌డం మ‌రొక ఎత్తు. కోలీవుడ్ బ్యూటీ రెజీనా విష‌యంలో ఆమే ప్ర‌తిభ‌ను .. ఆమే గ్లామ‌ర్ ను  వెలికి తీసే చిత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ప‌డ‌లేదంటారు .  గ‌త యేడాది గోపి చంద్ తో చేసిన  సౌఖ్యం చిత్రం  మంచి బ్రేక్ ఇస్తుంద‌ని ఆశించారు. కానీ  ఈ చిత్రం బాక్సాఫీసు  వ‌ద్ద  డిజాస్ట‌ర్ టాక్ తెచ్చుకుంది.

సినిమాల ప‌రంగా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఏదో ఆడింది..అంటే ఆడింది అనిపించుకుంది. సౌఖ్యం పెద్ద డిజాస్టర్..సరే తట్టుకుని, ప్రయత్నాలు చేస్తుంటే శౌర్య పేరుతో మరో డిజాస్టర్ పలకరించింది. ఎప్పుడో దాదాపు వర్క్ పూర్తి చేసిన నారా రోహిత్ శంకర విడుదల కావాల్సి వుంది. అంతకు మించి తెలుగులో ప్రస్తుతానికి సినిమాల్లేవు.

అప్పటికీ వీలయినపుడల్లా ఫంక్షన్ లకు బ్యాక్ లెస్ గా, ఇంకా చాలా చాలా టెంప్టింగ్ గా డ్రెస్ చేసుకుని వస్తోంది. అయినా పెద్ద హీరోలు ఎవరూ రెజీనాకు ఆఫర్లు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ డిజాస్టర్ల పుణ్యమా అని మీడియం హీరోల దగ్గరా ఆఫర్లు లేవు. తమిళంలో రెండు చేతిలో వున్నాయి. అవి అయ్యేలోగా ఏదయినా సినిమా పట్టుకోవాలి రెజీనా..లేదూ అంటే ఈ ముద్దుగుమ్మ ఫేడ్ అవుట్ కు ద‌గ్గ‌ర‌వుతున్న‌ట్లే అంటారు ప‌రిశీల‌కులు.