రాజ‌మౌళి ఇక భారీ ప్రాజెక్ట్ ల‌కు కేరాఫ్ ..!

వ‌ర‌స స‌క్సెస్ లు అందుకోవాలంటే  ఇండ‌స్ట్రీలో  సాధార‌ణ‌మైన విష‌యం కాదు.  ద‌ర్శ‌కుడి గా రాజ‌మౌళి ఆ క్రెడిట్ ను  త‌న ఖాతాలో వేసుకున్నాడు.  దీని వెన‌క సినిమా అంటే ఆయ‌న‌కు అంతులేని ప్రేమ ఉంది . త‌ప‌న .. అంకిత భావం ఇలా చెప్పుకుంటే పోతే ఒక బెస్ట్ ఫిల్మ్ మేక‌ర్ కు ఉండాల్సిన ఉత్త‌మ ల‌క్ష‌ణాలన్నీ  ఉన్నాయి. ఇక బాహుబ‌లి చిత్రంతో   ద‌ర్శ‌కుడిగా ఆయ‌న తెలుగు సినిమాను ప‌ది మెట్టు పైకి తీసుకెళ్లాడు. సాంకేతికంగా బాహుబ‌లి ప్ర‌పంచం అంతా మాట్లాడుకునేలా చేశారు.

క‌ట్ చేస్తే..  బాహుబ‌లి చిత్రంలో  ప్ర‌భాస్, రానాలతో పాటు అనేక మంది పెద్ద న‌టీ న‌టులు ఉన్నారు. వారందరిని స‌మ‌న్వ‌యం చేస్తూ ..అద్భుత‌మైన చిత్రం చేశారు.  దీంతో రాజ‌మౌళి  స్టామినా ఏమిటో ఇటు ద‌క్షిణాదిలో ఇత‌ర  సినిమా స్టార్స్ తో పాటు..ఉత్తరాది వారికి కూడా తెలిసి పోయింది.  ఆయ‌నతో సినిమా చేయ‌డానికి  మ‌హేష్ బాబు నుంచి..  అమీర్ ఖాన్ వ‌ర‌కు  సిద్దంగా వున్నారు. అయితే  మ‌న జ‌క్క‌న మాత్రం ద‌క్షిణాదికే త‌న తొలి ప్రాధ్యాన్యత అని తేల్చారు.  బాహుబ‌లి 2 త‌రువాత రాజ‌మౌళి .. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్..  విల‌క్ష‌ణ న‌టుడు సూర్యల కాంబినేష‌న్ లో ఒక మ‌ల్టీ స్టార‌ర్ ఫిల్మ్ కు  రంగం సిద్దం చేస్తున్నార‌నే టాక్  ఫిల్మ్ న‌గ‌ర్ లో  వినిపిస్తుంది.  ఎన్టీఆర్ , రాజ‌మౌళి ల కాంబినేష‌న్ ఎలా వుంటుందో..సింహాద్రి, య‌మ‌దొంగ చిత్రాల‌తో నిరూప‌ణ అయ్యింది.   రాజ‌మౌళి వంటి  మ‌హాశిల్పి కి..సూర్య‌, ఎన్టీఆర్ వంటి  తురుపు ముక్కులు దొరికితే   బొమ్మ  దుమ్ము లేపుద్ది అని చెప్ప‌డం అతిశ‌యోక్తి కాదు .అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అన్ని విశేషాలు  అధికారికంగా తెలియాల్సి వుంది మ‌రి.