నిహారిక డ‌బ్బింగ్ చెబుతోంది!

నాగ‌బాబు త‌న‌య‌ నిహారిక త‌న తొలిచిత్రం ఒక మ‌న‌సుకి డ‌బ్బింగ్ చెప్ప‌టం మొద‌లుపెట్టింది. రామ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి, టివి9 ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. నాగ‌శౌర్య నిహారిక స‌ర‌స‌న హీరోగా న‌టిస్తున్నాడు. హృద్య‌మైన ప్రేమ‌క‌థ‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఆడియోని ఏప్రిల్‌లో విడుద‌ల చేస్తామ‌ని, సినిమా మేలో రిలీజ్ అవుతుంద‌ని నిర్మాత‌లు చెబుతున్నారు. నిహారిక‌లో చాలా టాలెంట్ ఉంద‌నీ, భ‌విష్య‌త్తులో మంచిన‌టి అవుతుంద‌ని చిత్ర‌యూనిట్ చెబుతోంది. నిహారిక ఇప్ప‌టికే టివి షోస్ ద్వారా, ముద్ద‌ప‌ప్పు, ఆవ‌కాయ్ వెబ్ సీరియ‌ల్ ద్వారా బుల్లితెరల‌ మీద‌ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌యింది. ఇక మెగా తెర‌మీద ఈ మెగా డాట‌ర్ ఎలా అల‌రిస్తుందో వేచి చూడాలి.