అధికారికంగా చెప్పకపోయినా… అందరూ ఫిక్స్ అయిపోయారు…

బాలకృష్ణ వందో సినిమా ఏంటి? ఈ ప్రశ్నకు అంతా చెప్పే సమాధానం ఒకటే. అదే యోధుడు. అవును… క్రిష్ దర్శకత్వంలో తన వందో సినిమాను పట్టాలపైకి తీసుకొస్తున్నాడు బాలయ్య. ఈ విషయాన్ని నటసింహం అధికారికంగా చెప్పలేదు. కానీ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే… బాలయ్య ఇప్పుడు సీరియస్ గా గుర్రపు స్వారీ ప్రాక్టీస్ చేస్తున్నాడు. బాలయ్యకు గుర్రాలు కొత్తకాదు. కెరీర్ స్టార్టింగ్ నుంచి గుర్రపుస్వారీ తెలుసు. ఎన్నో పౌరాణిక, జానపద చిత్రాల్లో గుర్రపుస్వారీ చేశాడు కూడా. అయితే తాజాగా వందో సినిమాకు మాత్రం స్వారీలో మరింత పర్ ఫెక్ట్ అవ్వాలనుకుంటున్నాడు. ఎందుకంటే… గౌతమీపుత్ర శాతకర్ణి కథతో రాబోతున్న ఈ సినిమాలో యుద్ధాలు ఎక్కువగా ఉంటాయట. అందుకే గుర్రపు స్వారీపై పట్టుకోసం రెట్టించిన ఉత్సాహంతో బాలయ్య ప్రాక్టీస్ చేస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. 
Click on Image to Read:
rajamouli
ntr-pawan
varma1