నక్కజిత్తుల తోడేలు పాలిట సింహం జగన్‌

వైసీపీ ఐదేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా లోటస్‌ పాండ్‌లో జెండా ఆవిష్కణ జరిగింది. పార్టీ జెండాను ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన భవిష్యత్తు వైసీపీదేనన్నారు. పార్టీని వీడి వెళ్లిన ఎమ్మెల్యేలు ఇప్పుడు బాధపడుతున్నారని చెప్పారు. చంద్రబాబు రాజకీయాలు చూసి జనం కూడా సిగ్గుపడుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో ప్రసగించిన రోజా …జగన్‌ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు తామంతా గర్విస్తున్నామన్నారు. తమ లీడర్‌ వెన్నుపోటు దారుడు కాదని ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురొడ్డి పోరాడుతున్న ధీశాలి అన్నారు. నక్కజిత్తుల తోడేలు బాబును చీల్చిచెండాతున్న సింహం జగన్‌ అని అన్నారామె. మూడేళ్ల తర్వాత 30 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించేందుకు వస్తున్న ఉదయించే సూర్యుడు జగన్ అని అన్నారు. పేదోడిని పెద్దోడినిచేయడమే వైసీపీ లక్ష్యమన్నారు. జైలుకు పంపినా వెనక్కు తగ్గని వ్యక్తి తమ జగన్ అన్నారు. తెలుగోడి సత్తా ఢిల్లీకిచూపించిన నాయకుడు జగన్ అన్నారు.

Click on Image to Read:

bjp-president

photo

jagan-case-involved

jagan-sakshi

bandla-ganesh

kottapalli-geetha

123

jagan-smile-in-assembly

kcr-kadiyam

ys-chandrababu

trstdpcongress