షారూక్ సినీఅనుభవానికి ఎగ్జాంపుల్

 అవును… ఫ్యాన్ సినిమాను అంతా ఈ కామెంట్ తోనే పోలుస్తున్నారు. దశాబ్దాల షారూక్ నటనానుభవానికి ఒకే ఒక్క నిదర్శనం ఫ్యాన్ సినిమా అంటున్నారు. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. జస్ట్ ట్రయిలర్ మాత్రం విడుదలైంది. ఆ ట్రయిలర్ కే టోటల్ ఇండియా ఫిదా అయిపోయింది. హీరోగా, అభిమానిగా రెండు విభిన్న పాత్రలు పోషించిన షారూక్… తన నటవిశ్వరూపాన్ని ప్రదర్శించాడు. బాడీషేప్ తో పాటు.. .బాడీ లాంగ్వేజ్ లో ఊహించని మార్పులు చూపించిన షారూక్… ఫ్యాన్ సినిమాకు జీవం పోశాడు. కేవలం కమర్షియల్ గానే కాకుండా… అవార్డుల పరంగా కూడా ఈ సినిమా ముందువరుసలో ఉంటుందని  అందరితో అనిపించాడు. ఇదంతా కేవలం ఒకే ఒక్క ట్రయిలర్ తో షారూక్ చేసిన మేజిక్. మొన్నటివరకు ఈ సినిమాను కేవలం ఓ హీరో-అభిమాని మధ్య జరిగిన సంఘటనలతో తీసిన సినిమాగానే చూశారంతా. కానీ ట్రయిలర్ విడుదలైన తర్వాత ఫ్యాన్ సినిమాపై అంచనాలకు ఆకాశమే హద్దయింది. ఏప్రిల్ 15న విడుదలకానున్న ఈ సినిమా ఆ అంచనాల్ని ఏ మేరకు అందుకుంటుందో చూడాలి.