ఆస్ట్రేలియా మ‌హిళ అనుమానాస్ప‌ద మృతి!

హైద‌రాబాద్, గోల్కొండ‌లో ఆస్ట్రేలియా మ‌హిళ మార్గ‌రేట్ లిండా అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందింది. టూరిస్ట్ వీసాపై వ‌చ్చిన ఆమె సంవ‌త్స‌రంన్న‌ర కాలంగా హైద‌రాబాద్‌లో ఉంటోంది. ఆమె కుక్క‌ర్ అనే నైజీరియ‌న్‌తో స‌హ‌జీవ‌నం చేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. డ్ర‌గ్స్ ఎక్కువ మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల‌నే ఆమె ప్రాణాలుకోల్పోయిన‌ట్టుగా పోలీసులు భావిస్తున్నా, డ్ర‌గ్స్‌తో పాటు విషంలాంటిదేమైనా తీసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిందా అనే కోణంలోనూ పోలీసులు కేసుని ప‌రిశీలిస్తున్నారు. అలాగే ఇందులో కుక్క‌ర్ ప్ర‌మేయం ఉందా అనే కోణంలోనూ పోలీసులు ఆరాతీస్తున్నారు.