వంద గుర్రాలు.. ఏక్ గ‌బ్బ‌ర్..!

ప్ర‌తి హీరోకు కొన్ని ఫాంటసీలుంటాయి. ఆఫ్ కోర్స్ ..హీరోలకే కాదు ప్ర‌తి మనిషికి వుంటాయి. అయితే హీరోల‌కు త‌మ చిత్రాల్లో తమ ఫాంట‌సీలు తీర్చుకునే అవ‌కాశం వుంటుంది . ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టేస్ట్ లు కాస్త భిన్నంగా ఉంటాయి. వెదురు గ‌డలు.. గుర్రాలు..గ‌న్స్..బుల్లెట్స్ .. ఇవి ప‌వ‌న్ కు బాగా ఇష్టం అనిపిస్తుంటాయి. బుల్లెట్స్ వ‌ర్షం కురిపించి.. గుర్రాన్ని ప‌ట్టుకుని స్టైల్ గా న‌డుచుకుంటు రావ‌డం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు చాల స‌ర‌దా అంటుంటారు. ఆ స‌ర‌దాను త‌న తాజా చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ లో తీర్చుకుంటున్నాడు.

ఏకంగా 100 గుర్రాల‌తో ఒక పోరాట స‌న్నివేశం పెట్టార‌ట‌. చాల కార్లు కూడా ఉండే ఈ స‌న్నివేశాన్ని షూట్ చేస్తున్నారు ఇప్పుడు. వెయ్యి మంది జూనియ‌ర్ ఆర్టిస్ట్ లు న‌టిస్తున్నార‌ని వినికిడి. కాజ‌ల్ హీరోయిన్ గా న‌టిస్తుంది. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర‌త్ మరారీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేస‌వి బ‌రిలో స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ను దింప‌డానికి రంగం సిద్దం చేస్తున్నారు. హ‌రీశ్ శంక‌ర్ చేసిన మొద‌టి భాగం కంటే . సీక్వెల్ ను భారీ హిట్ చేయాల‌నే విధంగా వ‌ర్కువుట్ చేస్తున్నారు అనేది చిత్ర యూనిట్ నుంచి వినిపిస్తున్న టాక్.