చిరంజీవి చిన్న‌ల్లుడు ఇత‌డేన‌ట‌!

చిరంజీవి చిన్న‌కుమార్తె శ్రీజ వివాహం అతి త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోతున్న‌ద‌నే వార్త‌ల నేప‌థ్యంలో వ‌రుడు ఇత‌నే అంటూ ఒక ఫొటో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చెల్ చేస్తోంది. చిత్తూరుకి చెందిన కెప్టెన్ కిష‌న్ కుమార్ కుమారుడు క‌ల్యాణ్‌,  శ్రీజ‌ని వివాహం చేసుకోబోతున్నాడ‌న్న‌  సంగ‌తి తెలిసిందే. వారిద్ద‌రూ క్లాస్‌మేట్స‌ని స‌మాచారం.  శ్రీజ క‌ల్యాణ్‌ల వివాహం ఈనెల 25న హైద‌రాబాద్‌లోనే జ‌రుగుతుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే చిరంజీవి కుటుంబం పెళ్లి ప‌నుల్లో త‌ల‌మున‌క‌లుగా ఉన్న ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. చిరంజీవి చేతిక‌ట్టుతోనే ప‌సుపు కొట్టే కార్య‌క్రమం క‌నిపించారు. అలాగే  శ్రీజ పెళ్లి కూతురి ముస్తాబు, ఇంట్లో బంధుమిత్రుల హ‌డావుడి ఇవ‌న్నీ ఆ ఫొటోల్లో క‌న‌బ‌డుతున్నాయి.

chiranjeevi-02 chiranjeevi-03 chiranjeevi-01