పాత ప్రేయసికి దగ్గరవుతున్నరణబీర్

ప్రస్తుతం రణబీర్ కపూర్-కత్రినాకైఫ్ ప్రేమించుకుంటున్నారనే విషయం అందరికీ తెలిసిందే. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకుంటుందని కూడా బాలీవుడ్ ఎదురుచూస్తోంది. కానీ వీళ్లిద్దరు పెళ్లి చేసుకోవడం మాట అటుంచి… తమ డేటింగ్ బంధానికి కూడా చరమగీతం పాడాలని అనుకుంటున్నారట. తాజా సమాచారం ప్రకారం… ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ తో పాటు ఇగోస్ కూడా భయంకరంగా పెరిగిపోయాయని టాక్. దీనికి కారణం… రణబీర్ మాజీ ప్రేయసి దీపికా పదుకోన్.
కత్రినాకైఫ్ కంటే ముందే దీపికతో ఎఫైర్ సాగించాడు రణబీర్. కానీ కొన్ని కారణాల వల్ల దీపికకు దూరమై కత్రినాకు దగ్గరయ్యాడు. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో… తమషా సినిమా ప్రమోషన్ సందర్భంగా…. మరోసారి దీపికా పదుకునేకు రణబీర్ దగ్గరయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే…. కొన్ని రోజులు కాదు… కొన్నేళ్లు ఆగాల్సిందే.