స్టార్ హీరో ఆమెనే నమ్ముకున్నాడు, గట్టెక్కిస్తుందా?

కొందరు ఎంత టాలెంటెడ్ అయినా లక్ అస్సలు కలసిరాదు. అదే జరుగుతోంది తమిళ హీరో విక్రమ్ విషయంలో. అప్పుడెప్పుడో 2005లో ‘అపరిచితుడు ‘ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. దేశాన్ని ఒక కుదుపు కుదిపేసింది. కాని ఆ తర్వాత నుండి విక్రమ్ కి ఒక్క సరైన హిట్ కూడా లేదు. ఆ తర్వాత చేసిన డజను పైగా సినిమాలు చాలా నిరాశ పరిచాయి. చివరికి ఎంతో పెద్ద బడ్జెట్‌తో చేసిన ‘శంకర్ సినిమా ‘ఐ ‘ కూడా చాలా దిజప్పాయింట్ చేసింది. ఇక ఈ మధ్య వచ్చిన ’10 ఎండ్రాదుకుల్ల ‘ అనే తమిళ సినిమాకి కూడా అదే గతి పట్టింది.

విక్రమ్ తదుపరి సినిమా ఆనంద్ శంకర్ అనే డైరెక్టర్‌తో ఫిక్స్ అయ్యింది. మొదటగా ప్రొడ్యూసర్స్ మారిపోయారు ఫ్లాప్ పుణ్యమా అని. కాని హీరోయిన్‌గా మాత్రం ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న నయనతార ఒప్పేసుకుంది. ఆమె ఇప్పుడు మోస్ట్ లక్కీ హీరోయిన్ కోలీవుడ్‌లో. పైగా నయనతార ఉంటే హీరోయిన్ పర్‌ఫార్మెన్స్ అదిరిపోతుంది. అలాటి స్కోప్ ఉన్న రోల్ ఆమెకు ఇచ్చారంట. నయన, విక్రమ్‌తో జతకట్టడం ఇది మొదటిసారి అవుతుంది. నయనతార లకీ హ్యాండ్ విక్రమ్‌ని ఈసారైనా గట్టెక్కిస్తుందని ఇండస్ట్రీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే, విక్రమ్ లాంటి టాలెంటెడ్ యాక్టర్‌కి మంచి హిట్ రావాలని అందరూ కోరుకుంటారు మరి.