బాహుబలికి బాజీరావ్ కు సంబంధం లేదు

మరికొన్ని రోజుల్లో బాలీవుడ్ లో బాజీరావ్ మస్తానీ సినిమా విడుదలకాబోతోంది. రణ్వీర్ సింగ్-దీపిక పదుకోన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాపై ప్రస్తుతం హిందీ చిత్రసీమలో ఓ పుకారు షికారు చేస్తోంది. బాహుబలి సినిమాను పోలినట్టే బాజీరావ్ మస్తానీ కూడా ఉందంటోంది హిందీ మీడియా. దీనికి ఎగ్జాంపుల్ గా బాహుబలి ఫస్ట్ లుక్ ను, బాజీరావు ఫస్ట్ లుక్ ను కంపేర్ చేస్తున్నారు. అయితే వీటన్నింటిపై దీపిక క్లారిటీ ఇచ్చింది.
తమ కొత్త సినిమా బాజీరావు మస్తానీకి, బాహుబలికి అస్సలు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. ఫస్ట్ లుక్కులు ఒకటైనంత మాత్రాన సినిమాలు ఒకేలా ఉండాలని లేదంది. తను బాహుబలి సినిమా చూడలేదని చెబుతూనే, బాజీరావు కు బాహుబలికి అస్సలు సంబంధం లేదంటోంది. బాహుబలి ఫాంటసీ కథాంశమైతే, బాజీరావు చారిత్రక నేపథ్యమున్న వీరుడని చెప్పుకొచ్చింది దీపిక.