మళ్లీ మొదలుపెట్టనున్న మహేష్

సూపర్ స్టార్ మహేష్ మళ్లీ మొదలుపెట్టబోతున్నాడు. తన కొత్త సినిమా బ్రహ్మోత్సవానికి కొన్ని రోజులుగా బ్రేక్ ఇచ్చాడు మహేష్. కుటుంబసమేతంగా పారిస్ వెళ్లాడు. కొడుకు గౌతమ్, కూతురు సితారకు ఈఫిల్ టవర్ చూపించాడు. పారిస్ ట్రిప్ ముగిసి తిరిగి ఇండియాకు చేరుకున్నాడు మహేష్. దీంతో యూనిట్ అంతా మళ్లీ అలెర్ట్ అయింది. త్వరలోనే బ్రహ్మోత్సవం షూటింగ్ తిరిగి ప్రారంభమౌతుంది. తొలి షెడ్యూల్ తో సమంతతో కలిసి ఆడిపాడిన ప్రిన్స్, తాజాగా ప్రారంభం కానున్న షెడ్యూల్ లో కాజల్ తో కలిసి నటించనున్నాడు. హైదరాబాద్ లోనే ఈ షెడ్యూల్ ఉంటుంది. ఇది కంప్లీట్ అయిన వెంటనే, యూనిట్ అంతా ఊటీ వెళ్తుంది. ఊటీలో మరో హీరోయిన్ ప్రణీతతో కలిసి డ్యూయట్ వేసుకుంటాడు మహేష్. ఇలా వరుస షెడ్యూల్స్ తో సినిమాను పరుగులుపెట్టించడానికి రెడీ అవుతున్నాడు. మరోవైపు ఎక్కువమంది తారాగణంతో సినిమా తెరకెక్కుతోంది కాబట్టి, కాల్షీట్ల ప్రకారం సన్నివేశాలు తీయడానికి ఎక్కువ టైం పడుతోంది. కాబట్టి.. బ్రహ్మోత్సవంను వేసవి కానుకగా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.