రాజయ్య కుటుంబం అరెస్ట్

సంచలనం స‌ృష్టించిన మాజీ ఎంపీ రాజయ్య కోడలు, మనవళ్ల అనుమానాస్పద మ‌ృతి కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. రాజయ్య, అతడి భార్య మాధవి, కొడుకు అనిల్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అంతకు ముందు దాదాపు మూడు గంటల పాటు రాజయ్య కుటుంబసభ్యులను ఇంటి వద్దే పోలీస్ ఉన్నతాధికారులు విచారించారు.

మరణాలు అనుమానాస్సదమని తేలడంతో రాజయ్య కుటుంబసభ్యులను అరెస్ట్ చేసినట్టు వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు చెప్పారు. ఘటన జరిగినప్పుడు రాజయ్య, అతడి కొడుకు, కారు డ్రైవర్ ఇంటిలోనే ఉన్నారని ఆయన వెల్లడించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి కేసును చేధిస్తామన్నారు. కేసును సైంటిఫిక్‌గా నిరూపించేందుకు హైదరాబాద్ నుంచి ఫోరెన్సిక్ నిపుణులను కూడా రప్పించారు. సారిక, ముగ్గురు పిల్లల మృతదేహాలను వరంగల్ ఎంజీఎంకు పోస్టుమార్టం కోసం తరలించారు.