ఇరవై రోజుల్లో భారత్‌కు చోటా రాజన్‌

అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ను ఇండోనేసియా నుంచి భారత్కు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. భారత దౌత్యాధికారి సంజీవ్ అగర్వాల్ బాలి జైల్లో ఉన్న ఛోటా రాజన్ను కలిశారు. ఛోటా రాజన్ను భారత్కు తీసుకు వచ్చే విషయంపై సంజీవ్ అగర్వాల్… ఇండోనేసియా అధికారులతో చర్చించారు. ఇరవై రోజుల్లో ఛోటా రాజన్ను భారత్కు పంపిస్తామని ఇండోనేసియా అధికారులు చెప్పారు. ఇంటర్‌పోల్‌ సాయంతో ఛోటా రాజన్ను బాలి విమానాశ్రయంలో ఇండోనేసియా పోలీసులు వారం రోజుల క్రితం అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం చోటారాజన్‌ జైలులో ఉన్నాడు.