10 మంది ప్రాణాలు తీసిన లారీ

ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లా బరంపురం చౌరస్తాలో ఫుట్‌పాత్‌ మీదకు దూసుకెళ్ళిన లారీ 10 మంది ప్రాణాలు బలిగొంది. మరో 12 మందిని తీవ్ర గాయాలపాలు చేసింది. రోడ్డు పక్కన ఉన్న కార్మికులపైకి వేగంగా వచ్చిన లారీ అదుపు తప్పడంతో పది మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటనలో గాయపడిన 12 మందిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు ఉన్నట్టు గుర్తించారు. లారీ ఇలా అదుపు తప్పి కార్మికుల ప్రాణాలు తీయడంపై తోటి కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామని అన్నారు. పోలీసులు రంగంలోకి దిగి మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.