ఎలక్ట్రానిక్‌ వ్యాపార రంగంలోకి శిల్పాశెట్టి

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి తన భర్త రాజ్ కుంద్రాతో కలిసి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ రంగంలోకి అడుగిడబోతున్నారు. తమ కొడుకు వియాన్ పేరుతో మార్కెట్లోకి సరికొత్త మొబైల్ ఫోన్లను విడుదల చేయనున్నారు. ఐపీఎల్ రాజస్థాన్ సహాభాగస్వాములైన ఈ జంట బీఎస్‌ఈ, కోల్‌కతా స్టాక్ ఎక్సేంజీ ద్వారా తమ కంపెనీ కార్యకలాపాలను ఇప్పటికే ప్రారంభించిన విషయం తెలిసిందే. వచ్చేనెల 25న మొబైల్ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. అదేవిధంగా వియాన్ పేరుతో వియాన్ మొబైల్, వి-ట్యాబ్, వి-పవర్, వి-టీవి వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను దేశీయ మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అదేవిధంగా యూఏఈ, యూరోప్, అమెరికాలతో పాటు కామన్‌వెల్త్ దేశాల్లో కూడా వియాన్ ఉత్పత్తులను మార్కెట్ల చేయనున్నట్టు చెప్పారు.