ఇటలీలో ఫోర్న్‌ యూనివర్శిటీ

ఒకవైపు ఫోర్న్‌ సైట్లను నిషేధించడానికి భారత్‌ ప్రయత్నిస్తున్న వేళ ఇటలీలో ఏకంగా ఫోర్న్‌ విశ్వవిద్యాలయాన్నే ప్రారంభించిందో భామ. దీనికి సంబంధించి సిలబస్‌ కూడా ఖరారై పోయింది. ఏ కోర్సుకు ఎంత సమయం పెట్టాలి… ఏ కోర్సులో ఏం నేర్పించాలన్న దానిపై కూడా ఈ భామకు మంచి క్లారిటీ ఉందట. ముందుగా రెండు వారాల ప్రత్యేక కోర్సుకు శ్రీకారం చుట్టారు. పదమూడు వందల నీలి చిత్రాల్లో నటించిన ఫోర్న్‌ స్టార్‌ రొక్కో సిఫ్రెది తన అనుభవాన్నంతా రంగరించి ఈ యూనివర్శిటీలో కోర్సులను నిర్ణయించడమే కాకుండా మంచి తర్పీదు కూడా ఇస్తుందట. త్వరలో టెలివిజన్‌లో రియాలిటీ షో కూడా ప్రారంభించనున్నట్టు ఈ భామ ప్రకటించింది. నాలుగు గోడల మధ్య కోర్సులు ఎలా ఉన్నా పర్వాలేదు. కాని టెలివిజన్‌లో చేపట్టబోయే రియాలిటీ షోలో ఆమె ఏం చూపిస్తుందోనని అందరూ ఎదురు చూస్తున్నారు.