రిజర్వేషన్ల వ్యవస్థ దేశానికి ప్రమాదం: అన్నాహజారే

రిజర్వేషన్ల వ్యవస్థ దేశానికి ప్రమాదకరంగా తయారైందని సామాజిక కార్యకర్త అన్నాహజారే చెప్పారు. దేశ స్వాతంత్ర్యానంతరం కొంతకాలంపాటు అవసరమనుకున్న రిజర్వేషన్లు ఇంకా కొనసాగడం సరికాదన్నారు. రిజర్వేషన్ల అంశంలో రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవడం ప్రారంభమైనప్పటి నుంచీ దేశానికి ప్రమాదం పెరిగిందని హజారే చెప్పారు. రిజర్వేషన్ల విధానంపై ఒకసారి సమీక్ష జరపాలని, ఎవరికి నిజంగా రిజర్వేషన్లు అవసరమో గుర్తించాలని ఆయన అన్నారు. పేదలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్లు అవసరం లేనివారికి ఇస్తున్నారని, ఈ ప్రొవిజన్‌ దుర్వినియోగం అవుతుందని హజారే అన్నారు.