ఉచిత ల్యాప్‌టాప్‌ల కోసం తమిళ విద్యార్థుల ఆందోళన

ఉచిత ల్యాప్‌టాప్‌లు అందించాలని డిమాండ్ చేస్తూ తమిళనాడులో విద్యార్థినిలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం కింద పంపిణీ చేయాల్సిన ఉచిత ల్యాప్‌టాప్‌లను అందిచడం లేదని రెండు పాఠశాలలకు చెందిన 500 మంది విద్యార్థులు సాలెం జిల్లా కలెక్టర్ సంపత్‌ను అడ్డుకుని ఆందోళనకు దిగారు. ల్యాప్‌టాప్‌ల పంపిణీపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.