విద్యార్ధులకు బాహుబలిపై ఎగ్జామ్ పెట్టిన సంస్థ..

కెవి రెడ్డి తీసిన దొంగరాముడు సినిమా సిలబస్ గా మారిన వైనం మనందరికీ తెలిసిందే. మాయాబజార్ సినిమాను పూణె ఫిలిం ఇనిస్టిట్యూట్ లో సిలబస్ గా పెట్టిన విషయం కూడా మనకు తెలిసిందే. ఇప్పుడిదే కోవలోకి బాహుబలి కూడా ఎంటరైంది. పైరెండు సినిమాలు పాఠ్యాంశాలుగా మారితే బాహుబలి సినిమా ప్రశ్నాపత్రంగా మారింది. అవును.. ఓ ప్రముఖ ఇంజినీరింగ్ సంస్థ.. తమ విద్యార్థులకు ప్రశ్నాపత్రంలో బాహుబలికి సంబంధించిన ప్రశ్నలు అడిగింది. వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బి.టెక్ సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులకు ఎస్సైన్ మెంట్ లో భాగంగా బాహుబలికి సంబంధించి 2 ప్రశ్నలు అడిగారు. ఒక్కో ప్రశ్నకు 20 మార్కులు కేటాయించారు. ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కాబట్టి సినిమాలో సెట్స్ గురించి ప్రాక్టికల్ ఎప్రోచ్ లో రాయమని సూచించారు. దీంతో స్టూడెంట్స్ షాకయినప్పటికీ.. అంతా సినిమా చూశారు కాబట్టి బాహుబలి సెట్స్ ను ఎనలైజ్ చేస్తూ జవాబులు రాశారు. అలా జక్కన్న తీసిన బాహుబలి సినిమా ప్రశ్నాపత్రంలో ఓ భాగమైంది.