జర నవ్వండి ప్లీజ్ 223

ఇద్దరు కోటీశ్వరులు ఒక హోటల్లో కలుసుకున్నారు.
మొదటి కోటీశ్వరుడు: నేను ప్రపంచంలోని బంగారు గనులన్నిట్నీ కొందామనుకుంటున్నాను.
రెండో కోటీశ్వరుడు: నేను అమ్మితే కదా!
——————————————————————————-
వాసు: మీ మమ్మీ తలనొప్పి వస్తే ఏం చేస్తుంది?
శేషు: నన్ను ఆడుకొమ్మని బయటికి పంపిస్తుంది.
——————————————————————————-
జడ్జి: ఎవరయినా కోర్టులో అరిస్తే అతన్ని బయటికి పంపేస్తాం!
దొంగ: ఓహో ఓహో ఓయ్‌య్‌య్‌… అని అరిచాడు.