ఏపికి అంత గుర్తింపు ఎందుకంటే..

సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న పోస్ట్‌లను సోషల్ పల్స్ క్రింద ప్రచురిస్తున్నాం. -ఎడిటర్, తెలుగు గ్లోబల్.కామ్

‘వాణిజ్య అనుకూల’ జాబితాలో గుజరాత్ మొదటి స్థానం, AP రెండో స్థానం -World bank. KPMG అనే సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా వరల్డ్ బ్యాంకు APకి రెండవ ర్యాంకు ఇచ్చింది. (నిజానికి పరిశ్రమల పెట్టుబడుల్లో తమిళనాడు ప్రథమ స్థానంలో, గుజరాత్ రెండవ స్థానంలో ఉన్నాయి) కానీ వరల్డ్ బ్యాంకు మాత్రం పెట్టుబడులకు అనువైన రాష్ట్రాల్లో తమిళనాడుకు 12వ స్థానం, తెలంగాణకు 13వ స్థానం ఇచ్చింది, మహారాష్ట్ర 8వ స్థానంలో, కర్ణాటక 9వ స్థానంలో ఉంది, హైదరబాద్ ఉన్న తెలంగాణాకు 13వ స్థానం ఇవ్వడం ఆశ్చర్యం!

కారణాలు:
భూమి కేటాయింపులు, నిర్మాణ అనుమతులివ్వడం, పర్యావరణ సంబంధిత సమస్యల్లో పారిశ్రామికవేత్తలకు సహకరించడం, కార్మిక చట్టాలను సరళీకరించడం, మౌలిక వసతులను సమకూర్చడం, పన్ను రాయితీలు ఇవ్వడం, నిర్వహణను సులభతరం చేయడం వంటి అంశాలను ర్యాంకుల కోసం ప్రపంచ బ్యాంకు పరిశీలిచింది.
1. 1995-2004లో బాబు CMగా ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంకు జీతగాడు అని మిగితా రాజకీయ పక్షాలు ముద్దుగా పిలిచేవి, వరల్డ్ బ్యాంకు ఏది అడిగినా ఎలాంటి కండిషన్ పెట్టినా ముందు వెనక ఆలోచించకుండా ఒప్పుకునేది బాబే. రైతులను కాని, కార్మికులను కాని పట్టించుకోకుండా భూములిస్తాడు అని బ్యాంక్ అభిప్రాయం.

2. ఇండియాలో 15 లక్షల ఎకరాల భూమి సేకరించి ఇస్తాం అని చెప్పింది బాబు ఒక్కడే
జయలలిత కాని KCR కాని వరల్డ్ బ్యాంకు ముందు వంగి వంగి దండాలు పెట్టే రకం కాదు. ఇక గుజరాత్ అంటారా అది ప్రధాని రాష్ట్రం కదా!

By Veera Pratap in facebook