బిగ్‌బాస్‌-9కు రాధేమా నో!

ప్ర‌ముఖ‌ టీవీ రియాలిటీ షో బిగ్‌బాస్‌-9 కార్య‌క్ర‌మంలో పాల్గొనే వారి జాబితాలో ఇప్పుడు కొంద‌రు వివాదాస్ప‌ద వ్య‌క్తుల పేర్లు చేరాయి. ఇందులో త‌మ‌కు తాము దేవుడిగా చెప్పుకుంటున్న ఇద్ద‌రు వ్య‌క్తుల ప్ర‌స్తావ‌న ఉండ‌టంతో ఈ విష‌యం చ‌ర్చానీయాంశ‌మైంది.  ఇందులో డేరా స‌చ్చాసౌధా సంస్థ అధిప‌తి గుర్మీత్ రామ్ ర‌హీమ్ సింగ్‌తోపాటు ఇటీవ‌ల వివాదాస్ప‌ద ఆధ్యాత్మిక గురువినిగా పాపులర్ అయిన రాధేమా ఉండ‌టం విశేషం. ఈ విషయాన్ని డేరా స‌చ్చాసౌధా సంస్థ అధిప‌తి గుర్మీత్ సింగ్ వ‌ద్ద ప్ర‌స్తావించిన‌పుడు త‌న‌కు ఈ బిగ్‌బాస్ రియాలిటీషోలో పాల్గొన‌డం ఇష్ట‌మేన‌ని చెప్పారు. అయితే, షో నిర్వాహ‌కులు త‌న‌కు బ‌య‌టికి వెళ్లేందుకు 3 గంట‌లు అనుమ‌తి ఇవ్వాల‌ని, అప్పుడే త‌న భ‌క్తుల‌ను, అనుచ‌రుల‌ను క‌లుసుకునేందుకు వీలు ఉంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఇప్ప‌టికే త‌న‌కు తాను దేవుడిగా చెప్ప‌కుంటూ ఎంఎస్‌జీ పేరిట సినిమా విడుద‌ల చేసిన గుర్మీత్ దానికి సీక్వెల్‌ను ఇదే నెల 18 తేదీన విడుద‌ల చేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. ఈ రెండింటిలోనూ ఆయ‌నే హీరో కావ‌డం విశేషం.
ముద్దుల మాతా నో చెప్పింది!
ఇక భ‌క్తుల‌కు ముద్దులు, కౌగిలింత‌లు ఇచ్చి ఇటీవ‌ల జాతీయ మీడియాను ఒక ఊపు ఊపిన రాధేమా కూడా బిగ్‌బాస్ రియాలిటీ షోలో పాల్గొంటుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. దీన్ని రాధేమా అనుచ‌రులు ఖండించారు. ఇవ‌న్ని వ‌ట్టి వ‌దంతులేన‌ని స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు ఆమె లాయ‌ర్ ద్వారా ప్ర‌క‌ట‌న జారీ చేయించింది. తాను ఎలాంటి రియాలిటీ షోలో పాల్గొన‌డం లేద‌ని, ఇదంతా మీడియా సృష్టి అని పేర్కొన్నారు. మొత్తానికి ప్ర‌జ‌ల్లో పాపుల‌ర్ కావ‌డానికి ఆధ్యాత్మిక గురువులు ఇలాంటి రియాలిటీ షోలొ పాల్గొన‌డమేంట‌ని జ‌నాలు జుట్టు పీక్కుంటున్నారు.