లెక్క తప్పింది కేశవరెడ్డీ

సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న పోస్ట్‌లను సోషల్ పల్స్ క్రింద ప్రచురిస్తున్నాం.
                                                                                                   -ఎడిటర్, తెలుగు గ్లోబల్.కామ్
                                                          *****

లెక్క తప్పింది కేశవరెడ్డీ
విద్యా వ్యాపారం అంటూ ఈ రోజు లార్జెస్ట్ సర్క్యులేటేడ్ లో వార్త సారాంశం.
మీ స్కూల్ లో పిల్లాడిని చేర్పిస్తే లక్ష డిపాజిట్ చేయాలి .. చదువు ముగించుకొని వెళ్లి పోయేప్పుడు ఆ లక్ష తిరిగి ఇచ్చేస్తారు ..  చదివినందుకు పిల్లాడికి పీజు ఉండదు ..10 పరీక్షల్లో ఉమ్మడి రాష్ట్రంలో మీ స్కూల్ టాప్ వచ్చినట్టు చాలా ప్రకటనలు చూశాను కానీ .. ఏమీ అనుకోకు నువ్వు లెక్కల్లో చాలా వీకు కేశవరెడ్డీ.. లక్ష తీసుకోని ఫీజు లేకుండా చదువు చెప్పి డిపాజిట్ తిరిగి చెల్లిస్తాను అని తప్పు చేశావు .. లక్షకు బదులు అచ్చం చైనా విద్యా సంస్థల్లా ఏటా లక్షన్నర ఫీజు తీసుకోని ఉంటే ఇప్పుడు నీకు ఈ ఇబ్బందే వచ్చి ఉండేది కాదు. అవసరం అయితే మంత్రివర్గంలో నారాయణలా వెలిగి పోయే వాడివి .. మీ స్కూల్ పిల్లలు టాప్ గా నిలవడం కాదు కేశవరెడ్డీ వ్యాపారంలో లెక్కలు సరిగా రాక పోతే ఇలానే లెక్కల్లో లేకుండా పోతావు .. ఇంత చిన్న లెక్క ఎలా తప్పావు కేశవరెడ్డీ..!