ప‌రిణితి చోప్రా పై  క‌త్తి ప‌డిందా…!

ప‌రిణితి చోప్రా. అందం అంత ఒక ద‌గ్గ‌ర  పోగు ప‌డిన‌ట్లుండే హాట్ బ్యూటీ.  మొన్న‌టి వ‌ర‌కు కాస్తా బొద్దుగా వున్న త‌న హాట్ లుక్స్  తో కిర్రాక్ అనిపించింది. విద్యాబాల‌న్ లుక్ తో..  దీపిక ప‌దుకోణ్  మాదిరి  హాట్ నెస్ వున్న   ప‌రిణితికి   అబ్బాయిల పాలోయింగ్ చాల ఎక్కువ‌. అయితే త‌న బొద్దు ఫిగ‌ర్ ను చూసి ఫ్రెండ్స్  కాస్త త‌గ్గితే బెట‌ర‌ని స‌ల‌హాలు ఎక్కువుగా ఇస్తుండ‌టంతో  ప్ర‌భావితం అయిన‌ట్లుంది. దీంతో  అలియ భ‌ట్ సిన్సియ‌ర్ గా  వ‌ర్కువుట్ చేసి  దాదాపు  ప‌ది కేజిల బ‌రువు త‌గ్గించిన‌ట్లు  తెలుస్తుంది.
అయితే ఈ త‌గ్గుద‌ల వెన‌క     స‌ర్జ‌రీ చేయించుకుంద‌ని  కొంద‌రి వాద‌న‌..   స‌ర్జ‌రీ కాదు..డిటాక్స్ ప్రొగ్ర‌మ్  వ‌ల్ల‌నే  ప‌రిణీతి చోప్రా  ప‌ది కేజిల బ‌రువు త‌గ్గింద‌ని మ‌రి కొంద‌రి వాద‌న‌.  డిటాక్స్ ప్రొగ్రామ్ అయితే స‌ర్జ‌రీ అవ‌స‌రం లేకుండానే   బ‌రువు త‌గ్గే ప‌ద్ద‌తి.  ఈ ట్రీట్ మెంటుకు శ‌రీరం త‌ట్టుకుంటుందో లేదో న‌ని  కొన్ని ప‌రీక్ష‌లు ముందుగా చేస్తార‌ట‌.  ఓకే అనుకుంటే..15 రోజుల నుంచి 30 రోజ‌ల వ‌ర‌కు ఈ ట్రీట్ మెంట్ న‌డుస్తుంద‌ట‌. ఈ కోర్స్ లో  భాగంగా  ఇచ్చే డైట్ ను  6 నెల‌ల పాటు పాటించాల‌ట‌. అయితే  ఈ కోర్స్ లో బర‌వు త‌గ్గ‌డానికి   దాదాపు 10 ల‌క్ష‌ల వ‌రుకు ఖ‌ర్చు అయ్యింద‌ట‌. అంటే ప‌రిణితి  చోప్రా కేజి బ‌రువు త‌గ్గ‌డానికి  ల‌క్ష‌రూపాయ‌లు ఖ‌ర్చు చేసింది..అలా ప‌ది కేజిల‌కు  ప‌ది ల‌క్ష‌లు  స్పెండ్ చేసింది మ‌రి. అయితేనేమి  క‌త్తి లాంటి సెక్సీఫిగ‌ర్ ను ..ఒంటి మీద క‌త్తి వేయ‌కుండానే సొంతం చేసుకుంది మ‌రి.