మళ్ళీ తెరపైకి నమిత

బబ్లీ బ్యూటీ నమితను తీసుకోవడానికి తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడూ సిద్ధమే. కాకపోతే చేజేతులా అవకాశాల్ని వదులుకుంది నమిత. దీనికి కారణం ఆమె హెవీ వెయిటే. భారీగా బరువు పెరిగిన నమిత, తెలుగు హీరోలకు దూరమైంది. అప్పటికీ బాలయ్య లాంటి హీరోలు పెద్దమనసుతో ఆమెకు ఛాన్సులు ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత కూడా ఆమె తన బరువుపై దృష్టిపెట్టకపోవడంతో పూర్తిగా తెరకు దూరమైంది. అయితే ఇదంతా గతం. ప్రస్తుతం నమితను చూస్తే ఎవరైనా షాక్ కు గురవ్వాల్సిందే. అవును.. నమిత తన మునుపటి ఫిజిక్ ను సొంతం చేసుకుంది. శ్రీనువైట్ల దర్శకత్వంలో సొంతం సినిమాలో తెరకు పరిచయమైనప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలా ఉందంటున్నారు చాలామంది. మద్యే సాక్షి వెల్ నెస్ అనే కార్యక్రమానికి హాజరైంది నమిత. ఆ కార్యక్రమంలో స్లిమ్ లుక్ తో అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. ఊహించని విధంగా బరువుతగ్గి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. తాజా గెటప్ తో నమిత మళ్లీ రేసులోకి ఎంటరైందంటున్నారు చాలామంది. అందరి అంచనాలకు తగ్గట్టే తన పాత పరిచయాలన్నింటినీ తిరగదోడుతోంది నమిత.