సరికొత్త రికార్డు సృష్టించిన శ్రీమంతుడు

మహేష్ నటించిన శ్రీమంతుడు సినిమా ఊహించని విజయాన్నందుకుంది. విడుదలైన తొలిరోజు మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నశ్రీమంతుడు.. అనుకున్నట్టుగానే కలెక్షన్ల సునామీ సృష్టించింది. తొలి వారం రోజులకే 66కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా తాజాగా 10 రోజులకు సంబంధించి ఏకంగా 120 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. తెలుగులో బాహుబలి తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది శ్రీమంతుడు.  ఈ మూవీకి సంబంధించి మైత్రీ మూవీస్ నిర్మాతలు తాజా లెక్కలు విడుదల చేశారు. ఏరియా వైజ్ గా సినిమా ఎంత కలెక్ట్ చేసిందనే వివరాల్ని చెప్పుకొచ్చారు. ఓవర్సీస్ లో ఈ సినిమా ఇప్పటికే 18 కోట్ల రూపాయలు సంపాదించి, వరల్డ్ వైడ్ షేర్ కింద 82 కోట్ల రూపాయలు సంపాదించింది. భారీ బడ్జెట్ తో ఎంతో కష్టపడి తీసిన బాహుబలి సినిమాకు దగ్గరగా సాధారణ బడ్జెట్ తో తీసిన శ్రీమంతుడు మూవీ చేరుకోవడం నిజంగా విశేషం.