సల్మాన్ పై పరువునష్టం దావా

స్టార్ హీరో సల్మాన్ పై ఓ బాలీవుడ్ నిర్మాత పరువునష్టం దావా వేశాడు. ఒక కోటి.. రెండు కోట్లు కాదు.. ఏకంగా 250 కోట్ల రూపాయలకు పరువునష్టం దావా వేశాడు నిర్మాత విజయ్ గలానీ. గతంలో సల్మాన్ ఖాన్-విజయ్ గలానీ కలిసి వీర్ అనే సినిమా చేశారు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అప్పట్నుంచే వీళ్లిద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. సినిమాకు సంబంధించిన అగ్రిమెంట్ లో మార్పులు చేయమని సల్మాన్ కోరగా, విజయ్ అందుకు నిరాకరించాడు. దీంతో వ్యవహారం కొన్ని ఏళ్లుగా ముదిరి పాకాన పడింది. తాజాగా గలానీ, సల్మాన్ పై పరువు నష్టం దావా వేయడంతో విషయం మరోసారి హెడ్ లైన్స్ లో నిలిచింది. ఇప్పటికే పలు కోర్టు కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సల్మాన్ ఖాన్ కు, తాజాగా నమోదైన ఈ పరువునష్టం దావా కేసు మరిన్ని చిక్కులుతెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే.. వీర్ సినిమా టైమ్ లో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ తో పాటు.. కొన్ని సంస్థలు కూడా కూడా గిలానీకి అనుకూలంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా బాలీవుడ్ కు చెందిన ప్రొడ్యూసర్స్ గిల్డ్ కూడా గిలానీ తరఫున మాట్లాడ్డం మొదలుపెట్టింది. దీంతో సల్మాన్ కు మరిన్ని చిక్కులు వచ్చిపడ్డాయి. ఈ సినిమాతోనే జరైన్ ఖాన్, బాలీవుడ్ కు పరిచయమైంది.