జులై 10  ఏమౌతుందో..! 

ఒక సినిమా కోసం తెలుగు చిత్ర అభిమానులు ఇంత‌గా నీరిక్షించ‌డం  గ‌త 30 ఏళ్ల కాలంలో ఇదే అన‌డం  అతిశ‌యోక్తికాదు. ఒక్క ద‌ర్శకుడి మీద వున్న న‌మ్మకానికి ఇది పెద్ద  చాలెంజ్.  అప‌జ‌యం ఎరుగ‌ని ద‌ర్శ‌కుడిగా ట్రాక్ రికార్డ్ వున్న రాజ‌మౌళి..బాహుబ‌లి వంటి భారీ ప్రాజెక్ట్ ను  చెప‌ట్టిన‌ప్ప‌టి నుంచి ఆడియ‌న్స్  అంచ‌నాలు పెరుగుతూనే వ‌చ్చాయి. ఇక బాహుబ‌లి ప్ర‌చార‌చిత్రాలు విడుద‌లైన త‌రువాత‌..  ఈ అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగాయి. తెలుగు, త‌మిళ‌, హింది  ,క‌న్న‌డ‌, లాంగ్వేజెస్ లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. దేశ‌వ్యాప్తంగా నాలుగు లాంగ్వేజె స్ లో ఒకే రోజు  విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చే్స్తుండ‌టం మ‌రో విశేషం. మ‌రి ఇంత హైప్  క్రియేట్ చేసిన ప్ర‌భాస్, రానా..అనుష్క‌, త‌మ‌న్నా, రాజ‌మౌళి ల బాహుబ‌లి జూలై 10 న ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంత‌టి సంచ‌ల‌నం చేస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.