డైన‌మెట్ గా వ‌స్తున్నాడు…!

లేటు అయిన లేటెస్ట్ గా రావ‌డ‌మే హీరో మంచు విష్ణు కు  అల‌వాటు.  ఏకంగా ఈ సారి డైన‌మైట్ గా వ‌స్తున్నాడు.  ఒక సామాన్య పౌరుడి కోసం  సిటిలో పోలీసులంతా జ‌ల్లెడ ప‌డుతుంటారు.  అలా ఎందుకు చేశారు. సామాన్య జ‌నం కోసం ఒక సామాన్యుడు డైన‌మైట్ గా మారి ఏంచేశాడు అనే పాయింట్ తో ఈ చిత్రం వ‌స్తుంది. బ‌ల‌మైన క‌థ‌ల్ని ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించ‌డంలో డైరెక్ట‌ర్ దేవ‌కట్టా అందె వేసిన చేయి. 24 ఫ్రేమ్స్ ప‌తాకం పై  విష్ణు నిర్మాత‌గా చేస్తున్నారు. వ‌చ్చె నెల 3న సినిమాను రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. యాక్ష‌న్ నేప‌థ్యంగా సాగే థ్రిల్ల‌ర్ గా ఈసినిమాను తీర్చిదిద్దుతున్నారు.  ప్ర‌ణీత హీరోయిన్ గా న‌టించింది. మ‌రి చాల ప‌వ‌ర్ ఫుల్  టైటిల్ తో వ‌స్తున్న డైన‌మైట్  అభిమానుల్ని ఏ రేంజ్ లో అల‌రిస్తాడో లెట్స్ వెయిట్ అండ్ సీ.