పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ ఇంట్లో భారీ చోరీ

సికింద్రాబాద్ బోయిన్‌పల్లి పోలీస్టేషన్ పరిధిలోని… అడిషనల్ ఇన్‌స్పెక్టర్‌ ఇంట్లో జరిగిన దొంగతనం సంచ‌ల‌నం సృష్టించింది. పేట్ బషీర్‌బాగ్‌లో అడిషనల్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న శంకర్‌యాదవ్… గురువారం సాయంత్రం ఓ ఫంక్షన్‌కు కుటుంబసభ్యులతో కలసి దిల్‌షుఖ్‌నగర్‌ వెళ్లాడు. మళ్లీ ఇంటికి తిరిగి వచ్చేసరికి… బీరువాలోని 10 రౌండ్ల బుల్లెట్లు, 10 తులాల బంగారం, 20 తులాల వెండి, లక్ష రుపాయల నగదు చోరీకి గుర‌య్యాయి. దీంతో అవాక్కయిన శంకర్‌యాదవ్‌… స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే శంకర్‌ యాదవ్‌ తుపాకీ కూడా చోరీకి గురైనట్లు తెలుస్తోంది. అయితే ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డితే త‌న ఉద్యోగానికే ముప్పు వ‌స్తుంద‌న్న భ‌యంతో ఆయ‌న విష‌యాన్ని దాచిపెట్టిన‌ట్టు తెలిసింది. మొత్తానికి భారీ సెక్యూరిటీతో… ఎమ్మెల్యేలు సైతం ఉండే.. సికింద్రాబాద్‌ గ్రేటర్ కాలనీలో చోరీ జరగటం సంచ‌ల‌నం సృష్టించింది. పోలీస్‌ ఇంట్లోనే కన్నం వేసిన ఘరానా దొంగల‌ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.