వివాహితపై ‘సాధువుల’ గ్యాంగ్‌రేప్‌!

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ సమీపాన నంగలీ గ్రామంలోని ఆశ్రమంలో ఇటీవల ఒక వివాహితపై ఇద్దరు సాధువులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఢిల్లీలోని దరియాగంజ్‌కు చెందిన ఒక ఇంజినీర్‌ తన భార్యతో కలిసి వారం రోజుల క్రితం ఓ మతపరమైన కార్యక్రమానికి ఇక్కడికి వచ్చాడు. ఆశ్రమంలో తమ వెంట రావాల్సిందిగా ఇద్దరు సాధువులు కోరారనీ, బంతి భోజనాలు అయ్యాక తిరిగి వెళ్లేటప్పుడు వారు తన భర్తను నిర్బంధించి తనపై అత్యాచారం చేశారని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. ఆ ఇద్దరిని ఫెరూ(40), రాజు(22)గా పోలీసులు గుర్తించారు.