కానిస్టేబుల్‌ భర్తపై గొడ్డలితో భార్య దాడి

అతనో కానిస్టేబుల్‌. నిత్యం భార్యను వేధించేవాడు. చాలాకాలంగా పంటి బిగువనే భర్త వేధింపులను భరించిన ఆ భార్యామణి సహనం నశించి ఎదురు తిరిగింది. గొడ్డలి చేతబట్టి అపర కాళిక అవతారమే ఎత్తింది. వేధింపుల భర్తపై గొడ్డలితో దాడి చేసింది. ఈ దాడిలో గాయపడ్డ కానిస్టేబుల్‌ భర్తను బంధువులు ఆస్పత్రికి తరలించారు. 15వ గిరిజన బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కొమరం నరేష్‌పై అతడి స్వగ్రామం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లిలో అతడి భార్య శ్రావ్య ఈ దాడి చేసింది.