సూర్య మరో ప్రయోగం

ప్రయోగాలంటే ఎప్పుడు గెటప్పుల్లో, వేసే పాత్రల్లో మాత్రమే ఉండవు. ఎంచుకునే కథల్లో కూడా ప్రయోగాత్మకాలు ఉంటాయి. అలాంటి ప్రయోగాత్మకమైన కథనే ఎంచుకున్నాడు సూర్య. అప్పటి గజనీ నుంచి రీసెంట్ గా వచ్చిన రాక్షసుడు వరకు ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన సూర్య ఈసారి ఏకంగా కథతోనే ప్రయోగాలు మొదలుపెట్టాడు. కమర్షియల్ హంగులకు దూరంగా హైకూ అనే సినిమాను షురూ చేశాడు. ఈ సినిమా కథ మొత్తం చిన్న పిల్లల చుట్టూ తిరుగుతుంది. సూర్య గెటప్ లో పెద్దగా మార్పులుండవు.

కానీ పాత్రలో మాత్రం చాలా వేరియేషన్స్ ఉంటాయి. పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమలాపాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈమధ్య కాలంలో సూర్య నటించిన అతితక్కువ బడ్జెట్ సినిమాల్లో ఇదే మొదటిది. ఏమాత్రం ఖర్చుపెట్టకుండా.. కేవలం కథపై నమ్మకంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. తనను తాను ఎప్పుడూ టెస్ట్ చేసుకునే సూర్య ఈ పాత్రకు న్యాయం చేయాలని తెగ కష్టపడుతున్నారు. ఈ సినిమాలో అమలా పాల్ తో పాటు బిందుమాధవి కూడా ఉంది. సూర్య సరసన నటించడం బిందుమాధవికి ఇదే ఫస్ట్ టైమ్.