శంకరాభరణం కోసం కండలు

శంకరాభరణం.. వెరీవెరీ క్లాసీ టైటిల్. ఇలాంటి సినిమాకు హీరో కండలు పెంచాల్సిన అవసరం లేదు. కానీ హీరో విపరీతంగా కండలు పెంచుతున్నాడు. అవును.. ఇది హైటెక్ శంకరాభరణం. అప్పటి క్లాసిక్ కు దీనికి ఎలాంటి సంబంధం లేదు. అందుకే హీరో నిఖిల్ జిమ్ లో తెగ కష్టపడుతున్నాడు. ఎక్సర్ సైజులు చేస్తూ భారీగా కండలు పెంచుతున్నాడు. ప్రస్తుతం ఈ హీరో 5కిలోల వరకు బరువు పెరిగాడు.

దర్శకుడు కోన వెంకట్ సూచన మేరకు ఇలా కాస్త లావెక్కాల్సి వస్తోంది. బాడీ షేప్ రెడీ అవ్వగానే శంకరాభరణం సెట్స్ పైకి వెళ్తుంది. ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించి హీరోతోనే షెడ్యూల్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు. తర్వాత హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టుల్ని కలుపుకుపోతారు. ఓ డిఫరెంట్ కథతో శంకరాభరణం తెరకెక్కనుంది. కోన వెంకట్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు సమకూర్చడంతో పాటు దర్శకత్వం కూడా వహించబోతున్నాడు.