మహేష్ టీజర్ అదుర్స్

మరో రెండు రోజుల్లో మహేష్ కొత్త సినిమా టీజర్ విడుదలకాబోతోంది. సినిమాలో మహేష్ లుక్ తోపాటు.. సినిమా టైటిల్ ను కూడా ఆరోజే విడుదల చేస్తారు. సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా 31వ తేదీ ఉదయాన్నే మహేష్ కొత్త సినిమా టీజర్ అభిమానుల్ని అలరించబోతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ టీజర్ ఇన్ సైడ్ టాక్ అదిరిపోయింది. కొంతమంది టాలీవుడ్ ప్రముఖులు మహేష్ కొత్త సినిమా టీజర్ చూసి మెచ్చుకున్నారు. ఇప్పటివరకు మహేష్ సినిమాల టీజర్స్ అన్నీ హీరోయిజం ఎలివేట్ అయ్యేలా మాత్రమే వచ్చాయి. కానీ తాజా టీజర్ మాత్రం కాస్త విభిన్నంగా ఉంటుందని సమాచారం. మనం సినిమా ఫస్ట్ లుక్ ఇన్ స్టెంట్ గా ఎంత హిట్టయిందో.. అందులో ఎంత కొత్తదనం ఉందో.. మహేష్ కొత్త సినిమా టీజర్ కూడా అంతే కొత్తగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. అభిమానుల్లోని ఈ ఉత్కంఠకు తెరదించాలంటే మరో 2 రోజుల పాటు వెయిట్ చేయాల్సిందే.
          మిర్చి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఆగడుతో ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయిన మహేష్.. తాజా చిత్రంపై బోలెడన్ని హోప్స్ పెట్టుకున్నాడు.