నేటి నుంచి సికింద్రాబాద్ స్టేషన్‌లో వైఫై సేవలు 

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నేడు వైఫై సేవలు ప్రారంభం కానున్నాయి. దీంతో పాటు నూతన టికెట్ బుకింగ్ కౌంటర్‌ను ప్రారంభించనున్నారు. దీని ప్ర‌కారం ప్ర‌యాణికుల‌కు తొలి 30 నిమిషాలు ఉచిత వైఫై సేవలు అందుతాయి.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయతో పాటు ప‌లువురు ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె. శ్రీవాత్సవ  హాజరుకానున్నారు.