రూ. కోటి కొకైన్ ప‌ట్టివేత… ఇద్ద‌రి అరెస్ట్‌

హైదరాబాద్‌ నుంచి ఇతర దేశాలకు కొకైన్‌ను ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. విజయవాడకు చెందిన ఏసు, ఎల్‌బీనగర్‌కు చెందిన సత్యనారాయణ కలిసి కొంతకాలంగా ఇతర దేశాలకు కొకైన్‌ను సరఫరా చేస్తున్నారు. ఇందులో భాగంగా కొద్దిరోజుల క్రితం విజయవాడ నుంచి కిలో కొకైన్‌ను ఎల్‌బీనగర్‌కు తీసుకొచ్చి భద్రపరిచారు. సమాచారం అందుకున్న నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూర్‌ అధికారులు దాడులు నిర్వహించి వారిని అరెస్టు చేశారు. వారి నుంచి కిలో కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ కోటి రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. ఇంతకుముందూ వీరిద్దరూ కొకైన్‌ను ఎగుమతి చేశారని ఎన్‌సీబీ అధికారులు చెబుతున్నారు.