పరుగులు పెడుతున్న బెంగాల్ టైగర్

రవితేజ మళ్లీ తన పాత స్టయిల్ లోకి వచ్చేశాడు. బెంగాల్ టైగర్ సినిమా షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నాడు. పొద్దున్న లేస్తే చాలు ఈ సినిమా షూట్ లోనే ఉంటున్నాడు మాస్ రాజా. కిక్-2 ఇప్పటికే పూర్తయిపోవడంతో ఫోకస్ మొత్తం బెంగాల్ టైగర్ పై పెట్టాడు. తాజాగా ఈ సినిమా మూడో షెడ్యూల్ లోకి ఎంటరైంది.హీరోయిన్లు తమన్న, రాశిఖన్నాతో పాటు రవితేజ పాల్గొనగా ఓ సాంగ్ షూట్ చేశారు. రామోజీ ఫిలింసిటీతో పాటు అన్నపూర్ణ స్టుడియోలో వేసిన రెండు భారీ సెట్టింగుల్లో ఈ షూటింగ్ పూర్తిచేశారు. వచ్చేనెల 15వరకు ఈ మూడో షెడ్యూల్ కొనసాగుతోంది. సినిమాలో రవితేజతో పాటు మరో రెండు కీలక పాత్రల్లో హర్షవర్థన్ రాణె, అక్ష కనిపిస్తారు. బెంగాల్ టైగర్ సినిమాకు సంపత్ నంది దర్శకుడు. భీమ్స్ స్వరాలు సమకూరుస్తున్నాడు. సినిమా షూటింగ్ ను వీలైనంత తొందరగా పూర్తిచేసి వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 18న థియేటర్లలోకి దించాలని అనుకుంటున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై రాధామోహన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.