సూర్య దెయ్యం ఆ యువకుడిని మరిపించాల్సిందేనా?

తమిళ్‌లో ఎంత క్రేజ్ ఉందో, సూర్యకి తెలుగులో కూడా అంతే క్రేజ్ ఉందనడంలో సందేహం లేదు. రకరకాల పాత్రలతో మెప్పించిన సూర్య మొదటిసారిగా దెయ్యం రూపంలో మనల్ని దడిపించబోతున్నాడు. మొదట్లో ఈ విషయం కొద్దిగా షాక్‌కి గురి చేసినప్పటికీ, సూర్యకి ఉన్న క్రేజ్ అతడిపై నమ్మకాన్ని పెంచుతోంది. 20% దెయ్యం సరే. మరి 80% ఏమిటనే ప్రశ్నకు జవాబే, కూల్‌గా కనిపించే యువకుడి పాత్ర. 

80% యువకుడి పాత్ర ఉన్నప్పటికీ, 20% మాత్రమే ఉన్న దెయ్యం పాత్ర సక్సెస్‌ని బట్టే, సినిమా ఆధారపడి ఉందనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. పేరులోనే తెలుస్తోంది ‘రాక్షసుడు ‘ టైటిల్ కి జస్టిఫికేషన్ దెయ్యం పాత్ర అని. ఏది ఏమైనా, గెలుపు ఓటములను పక్కన పెడితే.. ఇలాంటి విన్నూత్నమైన పాత్రలతో తొలిసారిగా హారర్ కలగలిసిన ఎంటర్‌టైనర్ జానర్‌లో సూర్య ఎక్స్‌పెరిమెంట్ చేయడం వలన, పెద్ద స్టార్స్ ఇక మీదట హారర్ వైపు మొగ్గుచూపే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏమంటారు?