కన్నతండ్రే కాలయముడై… 

రంగారెడ్డిలోని బాంట్వారంలో సిమ్రాన్‌ అనే బాలికపై అత్యాచారం, హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. బాలిక తండ్రి మెగావత్‌ కమలే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు త‌మ దర్యాప్తు ద్వారా నిజాన్ని ఛేదించారు. బాలిక హత్య జరిగిన చోటు, పోలీసులకు కమల్‌ చెప్పిన కథనం ప్రకారం విచారించిన పోలీసులు కమల్‌పైనే అనుమానం వ్యక్తం చేశారు. బాలిక అంత్యక్రియలు పూర్తయిన వెంటనే కమల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ త‌ర్వాత‌ తమ స్టైల్‌లో విచారించగా కమల్‌ అసలు నిజాన్ని బయటపెట్టాడు. సిమ్రాన్‌పై అత్యాచారం చేసింది తానేన‌ని, ఆ త‌ర్వాత హ‌త్య చేసింది కూడా తానేన‌ని పోలీసుల విచారణలో అంగీకరించినట్లు సమాచారం. కేసు నుంచి త‌ప్పించుకోవ‌డానికి తనకు తానే రాయితో కొట్టుకుని గాయ‌ప‌డ్డాన‌ని… తాను ఇంత‌కుముందు చెప్పిన‌దంతా కట్టుకథ అని అంగీక‌రించాడు. పోలీసులు ఇప్ప‌టివ‌ర‌కు చేసిన ద‌ర్యాప్తు వివ‌రాలు, కేసు ఛేదించిన తీరు ఆదివారం మీడియాకు తెలిపే అవ‌కాశం ఉంది.