షారూక్ సర్జరీ పూర్తి

నిత్యం గాయాలతో సతమతమౌతుంటాడు షారూక్ ఖాన్. సరిగ్గా రెండేళ్ల కిందట భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇప్పుడు మోకాలి చిప్పకు సర్జరీ జరిగింది. కొన్ని నెలలుగా మోకాలు నొప్పులతో బాధపడుతున్నాడు షారూక్ ఖాన్. అయినా దాన్ని పట్టించుకోకుండా షూటింగ్ చేస్తూ వచ్చాడు. తాజాగా ఓ సాంగ్ షూటింగ్ లో దెబ్బ మీద దెబ్బ తగిలింది. దీంతో మోకాలు బాగా వాచిపోయింది. ఇక ఆపరేషన్ తప్పదని డాక్టర్లు చెప్పడంతో హుటాహుటిన హాస్పిటల్ లో చేరాడు షారూక్. కింగ్ ఖాన్ కు గురువారం ముంబయిలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తిచేశారు. డాక్టర్ సంజయ్ దేశాయ్ ఆధ్వర్యంలో నలుగురు వైద్యుల బృందం షారూక్ కు ఆపరేషన్ నిర్వహించింది. ఈరోజు ఏదో ఒక టైంలో షారూక్ డిశ్చార్జ్ అవుతారు. తను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన అభిమానులందరికీ షారూక్, ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపాడు.