ఇది గౌతమ్ ఫార్ములా

ఒకే  దెబ్బకు రెండు పిట్టలు అనేది రొటీన్ సామెత. ఒకే కథతో రెండు సినిమాలు.. ఇదిప్పుడు ఫిల్మీసామెత. మరీ ముఖ్యంగా దర్శకుడు గౌతమ్ మీనన్ ఫార్ములా ఇది. కథ రెడీ అయిందంటే.. మినిమం రెండు భాషల్లో సినిమా వచ్చినట్టే. అప్పుడెప్పుడో వచ్చిన చెలి సినిమా నుంచి మొన్నటి ఏమాయచేసావె వరకు ఇదే సూత్రం ఫాలో అవుతున్నాడు గౌతమ్. ఇప్పుడు కూడా తాజాగా తన స్టయిల్ ఆఫ్ మేకింగ్ తోనే దూసుకుపోతున్నాడు. తెలుగులో నాగచైతన్య, తమిళ్ లో శింబును హీరోలుగా పెట్టి గతంలో ఏమాయచేశావె సినిమాని ఒకేసారి తెరకెక్కించాడు గౌతమ్ మీనన్.
ఇప్పుడు కూడా ఈ ఇద్దరు హీరోలనే పెట్టి.. సింగిల్ కథతో రెండు సినిమాలు చుట్టేసే ప్లాన్ లో ఉన్నాడు. ఇప్పటికే సైలెంట్ గా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పైనే నాగచైతన్య ఉన్నాడు. చెన్నైలో కొన్ని యాక్షన్ సీన్లు పూర్తిచేశారు. త్వరలోనే బెంగళూరులో మరో షెడ్యూల్ ఉంటుంది. ఏమాయచేసావె సినిమాతో నాగచైతన్యకు లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చిపెట్టిన గౌతమ్.. తాజా చిత్రంతో చైతూను యాక్షన్ స్టార్ ను చేయాలనుకుంటున్నాడు.