సరికొత్త గెటప్ లో బాలయ్య

బాలయ్యకు గెటప్పులు కొత్తకాదు. తన ప్రతి సినిమాలో కాస్త డిఫరెంట్ గా కనిపించడానికే ప్రయత్నిస్తాడు నందమూరి నటసింహం. అయితే సింహా నుంచి ఒకే తరహా లుక్స్ లో కనిపిస్తున్నాడనే విమర్శలు బాలయ్యపై ఈమధ్య ఎక్కువయ్యాయి. ఈ సద్విమర్శల్ని దృష్టిలో పెట్టుకున్న బాలయ్య.. తన నెక్ట్స్ సినిమాలో సరికొత్తగా కనిపించాలని ఫిక్స్ అయ్యాడు. తన 99వ సినిమాగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీలో నయా గెటప్ లో అభిమానుల్ని అలరించడానికి రెడీ అవుతున్నాడు నటసింహం.
           99వ సినిమా కోసం బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాడు బాలయ్య. కాస్త స్లిమ్ లుక్ లో కనిపించాలనుకుంటున్నాడు. క్యారెక్టర్ కు కాస్త స్లిమ్ ఫిజిక్ అవసరమని దర్శకుడు చెప్పడంతో జిమ్ టైం పెంచాడు బాలయ్య. దీంతోపాటు 99వ సినిమాకు బాలీవుడ్ మేకప్ మేన్స్ కు రప్పిస్తున్నాడు. హిందీలో అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్ లాంటి స్టార్ హీరోల సినిమాలకు పనిచేసిన మేకప్ ఆర్టిస్టుల్ని బాలయ్య 99వ సినిమాకు బుక్ చేశారు. ఇవన్నీ చూస్తుంటే.. శ్రీవాస్ సినిమాలో బాలకృష్ణ నయా గెటప్ కాస్త ఇంట్రెస్టింగ్ గానే ఉండబోతోందన్నమాట.