బాహుబలి ఆడియో వేదిక ఎక్కడ?

సినిమా పాటలు రిలీజ్ చేయాలంటే క్యాజువల్ గా శిల్పారామానికి వెళ్లిపోతాం. ఇంకాస్త డబ్బులు ఖర్చుపెడితే.. ఓ స్టార్ హోటల్ బుక్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టాలనుకుంటే.. కాస్త రిచ్ సెట్ వేసి నడిపించొచ్చు. కానీ బాహుబలి సినిమా ఆడియో ఫంక్షన్ ను మాత్రం అంచనాలకు అందకుండా నిర్వహించాలనుకుంటున్నారు. చిన్నాచితకా వేదికలను అస్సలు పట్టించుకోవడం లేదు టీం. ప్రస్తుతం రాజమౌళి దృష్టిలో ఎల్బీ స్టేడియం ఉంది. అక్కడ బాహుబలి ఆడియోను విడుదలచేస్తే ఎలా ఉంటుందా అనే ఆలోచనలో ఉన్నాడు జక్కన్న. మరోవైపు గచ్చిబౌలిలోని మరో పెద్ద ప్రాంగణాన్ని కూడా పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ లోని ఈ రెండు వేదికలతో పాటు విశాఖపట్నంలోని ఆర్కే బీచ్, విజయవాడలోని మరో పెద్ద గ్రౌండ్ ను కూడా పరిశీలిస్తున్నారు. బాహుబలి సినిమాకు సంబంధించిన ఆర్ట్ డిపార్ట్ మెంట్.. ఆడియో ఫంక్షన్ కోసం కూడా భారీ సెట్టింగ్ స్కెచ్ రెడీ చేసుకొని సిద్ధంగా ఉంది. వేదిక ఖరారవ్వగానే పనులు ప్రారంభమౌతాయి. ఈనెల 31న బాహుబలి ఆడియోను గ్రాండ్ గా రిలీజ్ చేస్తారు. ఈ సినిమా హిందీ వెర్షన్ ను రిలీజ్ చేస్తున్న దర్శక-నిర్మాత కరణ్ జోహార్ కూడా ఈ ఆడియో ఫంక్షన్ కు హాజరవుతాడు.