ప్ర‌భాస్ కు ఎందుకు అంత తొంద‌ర‌..?

బాహుబలి చిత్రం  ఎంత బ‌డ్జెట్ తో  చేస్తున్న విష‌యం  హీరో ప్ర‌భాస్ కు తెలుసు. ఆయ‌న లీడ్ రోల్  లో రాజ‌మౌళి  తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం బ‌డ్జెట్ ప‌రంగా   ఒక రికార్డు. తెలుగులో  ఇప్ప‌టి వ‌ర‌కు   ఎవ‌రు  పెట్ట‌నంత  భారీ బ‌డ్జెట్ దాదాపు 200 కోట్లు పెట్టి తీస్తున్న‌ట్లు  తెలుస్తుంది. అయితే  హింది చిత్రాల కు మార్కెట్ పెద్ద‌గా వుంటుంది. ఎంత ఖ‌ర్చు చేసిన ఏమి కాదు.  కానీ ప్రాంతీయ భాష  చిత్రాల‌కు అంత అవ‌కాశం వుండ‌దు.  ఇటువంటి నేప‌థ్యంలో  ద‌ర్శ‌క జ‌క్క‌న్న  బాహుబ‌లి సినిమాను  మార్కెట్ ప‌రంగా తెలివిగా ప్లాన్ చేసుకుంటూ  వివిధ ర‌కాలుగా అమ్ముకొచ్చారు. ప్ర‌స్తుతం సినిమా నిర్మాత‌కు టేబుల్ ప్రాఫిట్ అనే టాక్ వినిపిస్తుంది.

 ఇదిలా వుంటే  ఈమ‌ధ్య  రాఘ‌వేంద్ర రావు  చేస్తున్న  ఒక  టీవి ప్రొగ్రామ్ కు గెస్ట్ గా ప్ర‌భాస్ వ‌చ్చాడు. ఆ షోలో రాఘ‌వేంద్ర‌రావు    బాహుబ‌లి సినిమా పై నీ అభిప్రాయం ఏమిటి అని ఒక ప్ర‌శ్న వేశారు.  అయితే దీనికి   తెలివిగా స‌మాధానం చెప్ప‌కుండా.. ప్ర‌భాస్   చెప్పిన ఆన్స‌ర్   రాజమౌళి   త‌న శ‌క్తి సామార్ద్యాలు ఒడ్డి  చేస్తున్న బాహుబ‌లి కి మైన‌స్ అయ్యేలా చెప్ప‌డం  బాధ‌క‌రం.  బాహుబ‌లి  ఇంట‌ర్వెల్ బ్యాంగ్  కంటే స్టూడెంట్ నెంబ‌ర్ వ‌న్  ఇంట‌ర్వెల్ బ్యాంగే చాల బెట‌ర్ అని చెప్పాడు.  ఇది నిజంగా  ఆలోచ‌న లేకుండా  మాట్లాడ‌మే అంటున్నారు చిత్ర యూనిట్. బ‌య‌ట‌కు వ‌చ్చి  హీరోనే అలా చెబితే..,   ప్రేక్ష‌కులు ఏమ‌నుకుంటారో  వేరే చెప్పాలా..?