వ‌ర్మ పెళ్లి సినిమా ఎలా వుంటుందో..?

ద‌ర్శ‌కుడిగా రామ్ గోపాల్ వ‌ర్మ  జీనియ‌స్.  ఈ విష‌యంలో  ఎవ‌రికి సెకండ్ థాట్ వుండ‌దు. అయితే సినిమా అనేది  వ్యాపారం.  అలాగే చేస్తున్న సినిమాలు ఏ వ‌ర్గం ఆడియ‌న్స్ ను టార్గెట్ చేస్తుంది అనేది కూడా  గ‌మ‌నించాలి.  ఈ మ‌ధ్య కాలంలో  వ‌ర్మ ఇటువంటి విష‌యాల ప‌ట్టించుకోవ‌డం లేదు. త‌న చిత్రాలు అస‌లు ప్రేక్ష‌కుల్ని ఎందుకు మెప్పించ‌డం లేదు అనేది  వ‌దిలేసి..  త‌న‌కు న‌చ్చిన ధోర‌ణిలో చిత్రాలు చేస్తూవున్నారు.

ఇక తాజాగా  నందు , అనైక సోథి  కాంబినేష‌న్ లో రామ్ గోపాల్ వ‌ర్మ చేసిన 365 డేస్ చిత్రం  శుక్ర‌వారం  ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది. అస‌లు  ఫ్యామిలీ స్టోరీస్ అంటే   న‌చ్చ‌ని వ‌ర్మ‌.. త‌న పాతికేళ్ల కెరీర్ లో   మొద‌టి సారి  గా   ప్రేమ‌, పెళ్లి నేప‌థ్యంగా సినిమా చేశారు. ఈసినిమాకు సెన్సార్ బోర్డ్ క్లీన్ యు స‌ర్టిఫికెట్ ఇవ్వ‌డం తో ఇదో రికార్డు అయ్యింది.  క్లీన్ యు పొందిన వ‌ర్మ మొద‌టి చిత్రం కూడా ఇదే కావ‌డం విశేషం.  మ్యారేజ్ అనే  సిస్ట‌మ్ ను స్త్రీ, పురుష  దృకోణంలో చేసిన‌ట్లు  వ‌ర్మ చెబుతున్నారు.   సినిమా వ‌ర్మ చెప్పిన‌ట్లు  వుంటుందా.. ?   లేక రోటిన్ సినిమాగా మిగిలిపోతుందా అనేది తెలియాలంటే  శుక్ర‌వారం వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే మ‌రి.