సింగం భామలు పక్కా అయ్యారు

సింగం సినిమా.. సింగం-2 సినిమా హిట్టవ్వడంతో సింగం-3 సినిమా సెట్స్ పైకి వెళ్లకముందు నుంచే హాట్ టాపిక్ గా మారింది. మరీ ముఖ్యంగా ఈ మూడో భాగంలో హీరోయిన్లు ఎవరనేది ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ గా మారింది. మొదటి రెండు భాగాల్లో నటించిన అనుష్కను పక్కనపెట్టారనే వార్తలొచ్చాయి. అయితే సింగం-3 హీరోయిన్లపై ఇప్పుడో క్లారిటీ వచ్చింది. బొమ్మాలి తన స్థానాన్ని నిలుపుకుంది. మొదటి రెండు సినిమాల్లో నటించినట్టుగానే మూడో సినిమాలో కూడా లీడ్ హీరోయిన్ క్యారెక్టర్ కొట్టేసింది. దీంతో అన్ని అనుమానాలకు తెరదించినట్టయింది. అయితే ఊహించని మార్పు మరొకటి జరిగింది. రెండో భాగంలో రెండో హీరోయిన్ గా నటించిన హన్సికకు మాత్రం ఈసారి సూర్య అవకాశం ఇవ్వలేదు. ఆ ప్లేస్ లోకి శృతిహాసన్ ను తీసుకున్నాడు. ఇంతకుముందు వీళ్లిద్దరి కాంబినేషన్ లో సెవెన్త్ సెన్స్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ శృతికి మరో అవకాశం ఇచ్చాడు సూర్య. హరి దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది సింగం-3.